IMD Alert in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమే కానీ దాదాపు రెండు వారాల పాటు వరుసగా వర్షాలు కురుస్తూనే ఉండటంతో వాతావరణం చల్లబడింది. మండే ఎండలతో వర్షాల కారణంగా పట్టణవాసులు ఊరిపి పీల్చుకున్నారు. ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ వారికి కాస్త ఉపశమనం లభించింది. రెండు వారాల పాటు గట్టి ఎండలు లేవనే చెప్పాలి. అల్ప పీడనం వల్ల వచ్చిన వర్షాలు మరియు చిరు జల్లలుకు ఫుల్ స్టాప్ పడ్డట్లు అయ్యింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మళ్లీ నేటి నుండి ఎండలు జనాలకు చుక్కలు చూపించడం ఖాయం అంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున ఉష్ణోగ్రతలు పెరగడం ఖాయంగా తెలుస్తోంది. మంగళవారం వరకు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ చెదురు మొదురు జల్లులు పడ్డాయి. కానీ బుధవారం మాత్రం మండే ఎండలు చుక్కలు చూపించబోతున్నాయి అంటూ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. 


తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల 40 డిగ్రీల సెల్సీయస్ నుండి 43 డిగ్రీల సెల్సీయస్ వరకు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్‌ తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సీయస్‌ గా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండబోతున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. 


ఒక్కసారిగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఆరోగ్యపరమైన సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు లేకపోలేదు అంటూ వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల నుండి బయట పడేందుకు గాను ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని.. ఎండకు వెళ్లిన సమయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు పేర్కొన్నారు. 


Also Read: TS SSC Results 2023: నేడే పదో తరగతి పరీక్ష ఫలితాలు.. డైరెక్ట్ లింక్ ఇదిగో..!  


ఇక ఏపీలో కూడా భారీ ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారం కూడా రికార్డు స్థాయి ఉష్ట్రోగ్రతలు నమోదు అయ్యాయి అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది. రాబోయే వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని ఏపీ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. 


మొత్తానికి గత రెండు వారాలుగా వర్షాలు మరియు చిరు జల్లుల కారణంగా చల్లబడి ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడి ఎక్కబోతుంది. రికార్డు స్థాయి లో ఎండలు కాచే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు అధిక ఎండల నుండి అప్రమత్తంగా ఉండటం ఉత్తమం అంటూ వాతావరణ శాఖ అధికారులతో పాటు వైద్యులు పేర్కొన్నారు.


Also Read: Pawan Kalyan OG : దారినపోయే దానయ్యవి కాదు.. దేవుడివి దానయ్య.. దండం పెట్టేస్తోన్న పవర్ స్టార్ ఫ్యాన్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి